మహేష్ రిజెక్ట్ చేస్తే విజయ్ దేవరకొండ ఓకే చేసాడట

అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట ప్రభంజనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఒకవైపు హిందీలో సినిమా చేస్తూనే తెలుగులో కూడా చిత్రాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ముఖ్యంగా మహేష్ బాబు , రాంచరణ్ లతో . మహేష్ బాబు అయితే సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయడానికి డేట్స్ కూడా ఇచ్చారని గుసగుసలు వినిపించాయి కట్ చేస్తే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ తో కాకుండా విజయ్ దేవరకొండ తో ఆ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది . మహేష్ బాబు సందీప్ తో సినిమా చేద్దామనుకున్నాడు కానీ ఎక్కడో తేడా కొట్టిందట దాంతో చేయలేనని చేతులు ఎత్తేయడంతో అదే కథతో విజయ్ దేవరకొండ హీరోగా సినిమా చేయలని భావిస్తున్నాడట సందీప్ రెడ్డి వంగా . అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ ఇద్దరూ మళ్ళీ కలిస్తే మరో సంచలనమే మరి